లండన్ లోని భారత దౌత్య కార్యాలయం ముందు పాకిస్థానీయుల విధ్వంసం!

  • మరోసారి హింసాత్మక ఘటనలు
  • పగిలిన కిటికీలు, వాహనాల అద్దాలు
  • కేసులు పెట్టామన్న లండన్ మేయర్
లండన్ లోని భారత దౌత్య కార్యాలయం ముందు పాకిస్థానీ మద్దతుదారులు విధ్వంసానికి దిగారు. కార్యాలయం పైకి రాళ్లను విసిరి అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వాహనాలపైనా విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని భారత యూకే అంబసీ, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. "భారత హై కమిషన్ కార్యాలయం ముందు మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆస్తి నష్టం సంభవించింది" అని పేర్కొంది.

జరిగిన నిరసనలపై లండన్ మేయర్ సాధిక్ ఖాన్ స్పందిస్తూ, ఈ తరహా చర్యలను తాము ఉపేక్షించబోమని అన్నారు. పోలీసులు ఆందోళన కారులపై కేసులను నమోదు చేశారని చెప్పారు. కాగా, పాకిస్థాన్ మద్దతుదారులు కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లను దౌత్య కార్యాలయంపైకి విసిరివేశారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో కొన్ని కిటికీలు, వాహనాల అద్దాలు పగిలాయని తెలిపారు. గత నెల 15వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో పాక్ జాతీయులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
London
Pakistan
Ambassy
Protest
India

More Telugu News